telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 27, బుధ‌వారం రాశిఫ‌లాలు..

మేష రాశి..
అవగాహనం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.. శుభవార్తలు వింటారు. ఇతరులను విశ్వసించడంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్లు అధికమవుతాడు.

వృషభ రాశి..
ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారు. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పనులను వాయిదా వేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.

మిథున రాశి..
నూతన పరిచయాలు కలుగుతాయి. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తగ్గుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుతాయి.నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం.

కర్కాటక రాశి..
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి.. పనిభారం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభసాటిగా సాగుతాయి.

సింహరాశి..
పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పుదు.

కన్య రాశి..
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సఫలం అవుతాయి. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.

తుల రాశి..
పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులు యత్నాలు ఆటంకాలు తప్పవు. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి.

వృశ్చిక రాశి..
ఎక్కువగా అప్పులు చేస్తారు.. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. బాధ్యతలు పెరుగుతాయ. వ్యాపారాలలో నిరుత్సాహంగా ఉంటారు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి.ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.

ధనుస్సు రాశి..
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సేవ కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో పని భారం ఉంటుంది.

మకర రాశి..
ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సానుకూలంగా ఉంటారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు.

కుంభ రాశి..
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి.మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం.

మీన రాశి..
పనులలో ఆటంకాలు జరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు జరుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు.పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారంవుంది. జాగ్రత్త అవసరం.

Related posts