ప్రపంచ దేశాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూసి మురిసిపోతున్నాయి. జపాన్ వరల్డ్స్ టూరిజం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా తెలంగాణ టూరిజం థీమ్ సాంగ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వరించింది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో సాంస్కృతిక, పర్యాటక రంగం కింద తెలంగాణ థీమ్ సాంగ్‌ను ప్రదర్శించారు.
ఈ పాట దూలం సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సాంగ్ చిత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం డిపార్ట్‌మెంట్ ఎంతో సహకారం అందించిందని, అంతర్జాతీయ అవార్డు రావడం గొప్పగా ఉందని దూలం సత్యనారాయణ పేర్కొన్నారు.