telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త జోనల్ వ్యవస్థతోనే ఉద్యోగాల కల్పన: కెసీఆర్

KCR cm telangana

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకున్నామని ఆయన అన్నారు.

కొత్త జోనల్ వ్యవస్థతోనే ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు.స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సుపరిపాలన కోసం పాత చట్టాలను మారుస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశామన్నారు. ప్రగతి ప్రస్తావాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. గ్రామాలు, పట్టణాలు ఆదర్శంగా తీర్చిదిద్డం కోసం కొత్త చట్టాలతో సంస్కరణలు మొదలుపెట్టామని చెప్పారు. సులభమైన పాలన కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు.

Related posts