telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : .. ఒకే పిల్లర్‌పై .. ఫ్లైఓవర్, మెట్రో..

single piller tech in hyderabad also

ఒకే పిల్లర్‌పై ఫ్లైఓవర్, మెట్రోరైలు, దిగువన రహదారిపై వాహనాలు.. ఇలాంటి దృశ్యం భవిష్యత్తులో నగరంలోనూ ఆవిష్కృతం కానుంది. మలిదశలో మెట్రోరైలు మార్గాలొచ్చే ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం నాగ్‌పూర్‌లోని డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్ల పనులను పరిశీలించింది. సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు మార్గం వల్ల ఫ్లైఓవర్ల నిర్మాణం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో అవకాశామున్న ప్రాంతాల్లో డబుల్‌ డెక్కర్‌ మార్గాలు నిర్మిస్తే ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో మార్గాలు ఏర్పడనున్నాయి.

ఈ విధానంతో భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గుతుంది. సమయం కూడా కలిసొస్తుంది. ట్రాఫిక్‌ సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ఇలా విస్తృత ప్రయోజనాలు ఉండడంతో నాగ్‌పూర్‌లోని డబుల్‌ డెక్కర్‌ మార్గాల పనులను సిటీ బృందం పరిశీలించింది. వివిధ నగరాల్లోని ఉత్తమ విధానాలను, మనకు పనికొచ్చే పద్ధతులను పరిశీలించాలన్న మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు అధికారులు తాజాగా నాగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ బృందంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్లు శ్రీధర్, జియావుద్దీన్, ఎస్‌ఈలు వెంకటరమణ, దత్తుపంత్, కేటీఆర్‌ ఓఎస్డీ మహేందర్‌ తదితరులున్నారు. నాగ్‌పూర్‌ మెట్రోస్టేషన్‌లో మేయర్‌ రామ్మోహన్, అర్వింద్‌కుమార్‌ తదితరులు

Related posts