telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ ,టీఆర్ ఎస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం కుదిరింది..

*చ‌రిత్ర‌ల‌లో నిలిచిపోయిన నిర్ణ‌యాలు సోనియాగాంధీ తీసుకున్నారు..
*ఏపీలో పార్టీచ‌చ్చిపోతున్నా..సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు..
*చారిత్రిక నిర్ణ‌యాల‌ను అవ‌మానప‌రిచేలా మోదీ వ్యాఖ్యానించారు..

*మోదీ వాఖ్య‌ల‌ను కేసీఆర్ ఖండించ‌లేదు..
*బీజేపీ టీఆర్ ఎస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఉంది..
*పార్ట‌మెంట్‌లో మోదీ వాఖ్య‌ల‌కు టీఆర్ ఎస్‌నేత‌లు మ‌ద్ధ‌తు..

*పార్ల‌మెంట్‌లో మోదీ చిమ్ముతుంటే టీఆర్ ఎస్ నేత‌లు నిల‌దీయలేదు..

తెలంగాణ విభజన పై ప్రధానమంత్రి మోదీ పార్ల‌మెంట్‌లో వ్యాఖ్యలు చేసి అయిదు రోజులు గడుస్తున్నా…సీఎం కేసీఆర్​ ఎందుకు ఖండించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను అవమానిస్తుంటే కేసీఆర్​ ఎందుకు బయటకు రావడం లేదని నిలదీశారు. గాంధీ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. కేసీఆర్​ తీరుపై రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తారని అనుకున్నాం ..కానీ సీఎం కేసిఆర్ కుటుంబసభ్యులు భ‌య‌ప‌డి ఎక్కడ దాక్కున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సమాజమంతా కదిలితే కేసీఆర్‌ కుటుంబం బయటకు ఎందుకు రాలేదని నిలదీశారు. ఏదో తూతూ మంత్రంగా టీఆర్ఎస్ నేతలు నల్ల జెండాల ప్రదర్శన చేశారని అన్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబ పీఎం మోది దిష్టి బొమ్మలను ఎందుకు దగ్దం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ బీజేపీకి తొత్తులుగా మారి, మోదికి భయపడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

మోది తెలంగాణను ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన తిప్పికొట్టాల్సిన బాధ్యత సీఎం కేసిఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. రోజు అభివృద్ది కార్యక్రమాల పేరుతో రిబ్బన్ కటింగ్ చేస్తూ… కాలం గడిపిన మంత్రి కేటిఆర్ ఎందుకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని అన్నారు.

Related posts