telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కన్నుమూశారు

Kodi-Ramakrishna

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కన్నుమూశారు. గతకొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న అనారోగ్యం కారణంగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించారు. కొంతకాలం క్రితం పక్షవాతం బారిన పడ్డ ఆయన కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే హాస్పిటల్ కు చేరుకున్నట్లు సమాచారం.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన 1982లో “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” చిత్రంతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఆ తరువాత టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి దాదాపు 30 ఏళ్ళుగా మంచి దర్శకుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో అమ్మోరు, అరుందతి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.

Related posts