telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

చందాకొచ్చర్ చుట్టూనే.. వీడియోకాన్ స్కాం ఉచ్చు.. !!

cbi case on icici ex chief husband

మాజీ ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్‌ చుట్టూ వీడియోకాన్‌ స్కాం ఉచ్చు బిగుస్తోంది. ఆ విషయంలో ఆమెపై ఇప్పటికే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తాజాగా చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ దూత్‌కు సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్‌ సంస్థకు రుణం మంజూరు చేయడంలో చందాకొచ్చర్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే సీబీఐ నిర్ధరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవికి రాజీనామా చేయగా, స్కాం కారణ రీత్యా తొలగింపుగా భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అలాగే ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇంక్రిమెంట్లు, స్టాక్‌ ఆప్షన్లు, మెడికల్‌ ప్రయోజనాలను రద్దు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మనీలాండరింగ్‌, క్విడ్‌ప్రోకో ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Related posts