telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇంట్లోకి తొంగి చూసిన పిజ్జా డెలివరీ బాయ్ కి నగ్నంగా…!?

Pizza

మార్క్ బూడే అనే పిజ్జా డెలివరీ బాయ్ గతేడాది నవంబర్‌లో మొటెల్ అనే ప్రాంతంలో పిజ్జా ఆర్డర్ వచ్చిన అడ్రస్‌కు డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించింది బూడేకు. దాంతో లోపలకి తొంగి చూసిన అతడికి గదిలో బెడ్‌పైన ఓ చిన్నారి నగ్నంగా పడి ఉండడం చూశాడు. ఆ దృశ్యం చూసిన బూడేకు అనుమానం రావడంతో లెక్సింగ్టన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతడి సమాచారంతో అక్కడి వచ్చిన పోలీసులు సదరు వ్యక్తి ఇంట్లో గాలించగా ఒక గదిలో ఇద్దరు బాలికలు దొరికారు. వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ తండ్రి చేస్తున్న ఘనకార్యం ఏంటంటే సొంత కూతుళ్లపైనే గత కొంతకాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు ఆ వ్యక్తి. దాంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. కన్నతండ్రి చెర నుంచి ఇద్దరు కూతుళ్లను విముక్తి కలిపించడంలో సహకరించిన ఓ పిజ్జా డెలివరీ బాయ్‌ను కెంటకీ పోలీసులు మంగళవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించడంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు.

Related posts