telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

రైతుల దేశభక్తి : పాక్ కు కూరగాయల ఎగుమతి నిలిపివేత, .. కిలో టమోటా 180/-కే..

farmers stoped exporting vegetables to pak

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ భారత్ వైపు నుండి అన్ని దారులు మూసుకుపోతున్నాయి. తాజాగా ఆ దేశానికి టమోటాల ఎగుమతిని ఆపివేస్తూ మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లా రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర పటిదార్ అనే రైతు మాట్లాడుతూ, ‘మేము టమోటాను సాగు చేస్తున్నాం. పాకిస్థాన్ కు కూడా ఎగుమతి చేస్తున్నాం. మన ఆహారాన్ని తింటూ మన జవాన్లనే వారు చంపుతున్నారు. పాకిస్థాన్ నాశనం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇతర దేశాలు కూడా పాకిస్థాన్ కు టమోటాను ఎగుమతి చేయరాదని మేము కోరుతున్నాం’ అని చెప్పారు.

పాకిస్థాన్ కు టమోటాను ఎగుమతి చేయడం ద్వారా తాము ఎంత సంపాదిస్తామనేది ముఖ్యం కాదని బసంతిలాల్ పటిదార్ అనే రైతు చెప్పారు. సైన్యమే లేకపోతే మనం ఎలా బతుకుతామని… ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. మరోవైపు దేశంలోనే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని అజాద్ పూర్ మండీ నుంచి పాకిస్థాన్ కు భారీ ఎత్తున కాయగూరలు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ప్రతి రోజు 75 నుంచి 100 ట్రక్కుల టమోటా పాకిస్థాన్ కు వెళుతుంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ కు ఎలాంటి ఉత్పత్తులను సరఫరా చేయకూడదని మండీ కూడా నిర్ణయించింది.

దీనితో భారత్ లో కేజీ టమోటా రూ.10 ఉండగా… పాకిస్థాన్ లోని లాహోర్ లో కేజీ రూ.180కి పెరిగింది. పెరిగిన టమోటా ధరలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైతులు తీసుకున్న నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రశంసించారు. రైతులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

Related posts