కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. కొందరు నగదును సాయంగా ప్రకటిస్తుంటే, మరి కొందరు స్వయంగా పేదలకు ఆహారం, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు. తాజాగా సినీనటుడు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలు మరోసారి తమ మంచి మనసును చాటుకుంటున్నారు. కరోనా విజృంభణ సమయంలో మరోసారి సాయం ప్రకటించారు. ఇటీవలే శివాని, శివాత్మికలు ఒక్కొక్కరు రూ.1లక్ష చొప్పున సీసీకి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఈ రోజు వారిద్దరు కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల సాయాన్ని అందించారు. వారిని కేటీఆర్ అభినందించారు.
దీపికా స్టార్… అందుకే ఆమెకు జోడిగా నన్ను తీసుకోవడం లేదు : సల్మాన్ ఖాన్