కేరళలోని కాసరగోడ్ జిల్లాకు చెందిన ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు హత్యకు గురికావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇద్దరు కార్యకర్తలు హత్యకు గురికావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నాయకులైన క్రిపేశ్, శరత్ లాల్ ఆదివారం బైక్‌పై వెళ్తుండగా.. కొందరు దుండగులు దాడి చేయడంతో వారు మృతి చెందారు. దీంతో కృపేశ్ అక్కడిక్కడే మృతిచెందగా.. శరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఈ ఘటన పై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. కార్యకర్తల మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆయన వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
previous post
next post


కుంతియా అనే ఐరన్‌లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే