telugu navyamedia
సామాజిక

ఒకే కాన్పులో ఏడుగురు జన్మించారు

One delivery 7 kids born Iraq
ఇరాక్‌కు చెందిన 25 ఏళ్ల మహిళకు ఒకే కాన్పులో ఏడుగురు జన్మించారు. ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయికి ఆ మహిళ జన్మనిచ్చింది. స్థానిక  దియాలీ ప్రావిన్స్‌లోని ఆస్పత్రిలో ఏడుగురి పిల్లలకు మహిళ జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని స్పష్టం చేశారు. ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం పది మంది అయ్యారు. ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనివ్వడం ఇరాకీలో ఇదే తొలిసారి కావొచ్చని ఆసుపత్రి  వైద్యులు భావిస్తున్నారు.

Related posts