“కేఫ్ కాఫీ డే” అధినేత వీజే సిద్ధార్థ మృత దేహం నదీతీరంలో లభ్యమైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. కాఫీడే సిద్ధార్థది ఆత్మహత్యేనని తేలింది. పోస్టుమార్టం తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. ఈ మేరకు వెన్‌లాక్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి తెలిపారు.
అదృశ్యమైన రోజునే సిద్ధార్థ నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇప్పటి వరకు చేసిన పరీక్షల ద్వారా స్పష్టమైనట్టు పేర్కొన్నారు. అయితే, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నదిలో దూకారా? లేక, ఎవరైనా బలవంతంగా ఆయనను నదిలోకి నెట్టారా ? అన్న విషయం మాత్రం పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. సిద్ధార్థ ఊపిరి తిత్తుల్లోకి నీరు బాగా చేరిందని డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. దీనిని బట్టి ఆయన నీటిలో మునగడం వల్లే చనిపోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు.
రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు…