telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా…?

Gold rates hike

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో స్థిరంగా ఉంటె ఢిల్లీలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 10 తగ్గి రూ. 48,150 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 44,140 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,830 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో స్థిరంగా రూ.71,600 వద్ద ఉన్నది.

Related posts