రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది… తొలిరౌండ్ నుంచి వరుసగా ఐదు రౌండ్లలోనై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు స్పష్టమైన ఆధిక్యాన్ని కబరుస్తూ రాగా… ఆరో రౌండ్లో ఆయనకు టీఆర్ఎస్ బ్రేక్‌లు వేసింది.. ఆరు, ఏడు రౌండ్లలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు స్పల్ప ఆధిక్యం లభించగా… ఎనిమిదో రౌండ్లో తిరిగి లీడ్‌లోకి వచ్చింది బీజేపీ.. మొత్తంగా.. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్టి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు… ఆరు, ఏడు రౌండ్లలో.. టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం కనబర్చినా.. మొత్తంగా మాత్రం రఘునందన్‌రావే ఆధిక్యంలో ఉన్నారు. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 3,106 ఓట్ల ఆధిక్యం లభించగా… మొత్తంగా.. బీజేపీకి 25,878 ఓట్లు, టీఆర్ఎస్కు 22,722 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5,125 ఓట్లు లభించాయి. క్షణక్షణం ట్రెండ్స్ మారుతూ.. తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

