telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓ మహిళకు అబార్షన్ చేయబోయిన డాక్టర్… పొరపాటున…!

Is pregnant makeup healthya

సౌత్ కొరియాలో ఆసుపత్రి యాజమాన్యం చేసిన పొరపాటుకు ఓ యువతి గర్భం అబార్షన్ పాలయ్యింది. ఆగస్ట్ 6వ తేదీన తాను గర్భం దాల్చినట్టు సందేహం రావడంతో సియోల్‌లో ఓ ఆసుపత్రికి వెళ్లానని తెలిపింది. డాక్టర్లు పరీక్షలు చేసి గర్భం దాల్చినట్టు తేల్చారని, పోషక పదార్థాల బూస్ట్ కోసం ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారని పేర్కొంది. ఇంజెక్షన్ కోసం డెలివరీ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో డాక్టర్, నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారని, అనంతరం తాను ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. కొద్ది గంటల తర్వాత బ్లీడింగ్ అవ్వడంతో మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్తే తనకు అబార్షన్ జరిగినట్టు తేలిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. వేరొక మహిళకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ పొరపాటున తనకివ్వడం కారణంగానే ఇది జరిగినట్టు యువతి తెలిపింది. దీనిపై పోలీసులకు సమాచారమివ్వగా.. కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ కొరియా చట్టాల ప్రకారం అబార్షన్ చేయడం, చేయించుకోవడం రెండూ నేరమే. అత్యాచారం లేదా గర్భం వల్ల తల్లి ప్రాణాలకు ప్రమాదమన్న సమయంలో మాత్రమే సౌత్ కొరియాలో డాక్టర్లు అబార్షన్ చేయాలి. ప్రస్తుతం అబార్షన్ చేయించుకోవాలనుకున్న మహిళకు.. అబార్షన్ చేయదలచిన డాక్టర్‌కు జైలు శిక్ష పడే అవకాశముంది. కాగా, డిసెంబర్ 31 2020 నుంచి సౌత్ కొరియా అబార్షన్‌ను లీగల్ చేయనుంది. సౌత్ కొరియా ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గతేడాది అక్కడ 5 లక్షల అబార్షన్‌లు జరిగాయి. అయితే ఈ సంఖ్య పది లక్షలకు పైగానే ఉంటుందని అక్కడి మీడియా చెబుతోంది.

Related posts