యువనటుడు శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘రణరంగం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించనున్న శర్వా.. ’96’ తెలుగు రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు శర్వానంద్ తాజాగా మరో చిత్రానికి కూడా శ్రీకారం చుట్టాడు. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, శశికాంత్ వల్లూరి, బుర్రా సాయిమాధవ్, రామ్ ఆచంట, గోపి ఆచంట తదితరులు పాల్గొన్నారు.
ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రధాన తారాగణం ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే కొద్ది రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటూ శర్వానంద్ అనుకోకుండా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. సన్‌షైన్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన శర్వా రీసెంట్‌గా డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే ఆయన షూటింగ్స్‌లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.