telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడిచేయడం సబబు కాదు: కేటీఆర్

ktr trs president

అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌పనగర్ మండలం సార్ సాలాలో అటవీ శాఖాధికారిణి అనిత, సిబ్బందిపై జరిగిన దాడిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సబబు కాదని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప, దాడులు చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయనపై ఇప్పటికే కేసు నమోదైందని, ఆయన్ని అరెస్టు చేశారని చెప్పారు.

హరితహారంలో భాగంగా భూములను దున్నడానికి అటవీశాఖాధికారులు, సిబ్బంది కాగజ్ నగర్ మండలంలోని సార్ సాలాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిపై కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కోనేరు కృష్ణారావు, బూర పోషంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు.

Related posts