telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లి కాల్చిన సిగరెట్ కు పసివాడు బలి

nicotine-vaping-liquid

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికి ఈ అలవాటును మానుకోలేకపోతారు చాలామంది. అయితే ధూమపానం వల్ల సిగరెట్ తాగే వారి ప్రాణాలకే కాదు పక్కన ఉన్న వారి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తను కాల్చే సిగరెట్ కారణంగా తన కుమారుడిని కోల్పోయింది. ధూమపానం అలవాటును వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ కుదరలేదు. దాంతో ఈ-సిగరెట్లను వాడటం మొదలెట్టింది. వాటిలో కూడా వేపింగ్ (ఆల్కహాల్ పోసి వాడుకునే) సిగరెట్లను తీసుకొంది. అయితే అదే ఆమె కొంపముంచింది. సిగరెట్లో మందు పోసుకొని బాటిల్ పక్కన పెట్టడానికి వెళ్లినపుడు.. ఆమె 19 నెలల కుమారుడు ఆ సిగరెట్‌ను నోటిలో పెట్టుకొని పీల్చాడు. ఆ పొగను తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. 11 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆ పసివాడు చివరకు ఓడిపోయాడు. తన పొరబాటు వల్లే కుమారుడు మరణించాడంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమయింది. చేతులు కాలాక ఆకులు పెట్టుకుంటే లాభం ఏంటి ? ఇంట్లో పసివాడు ఉన్నప్పుడు ముందే జాగ్రత్త పడితే బాగుండేది.

Related posts