telugu navyamedia
సినిమా వార్తలు

అక్కడ కోలాహలంగా ఉంది..

‘లవకుశ’ చిత్రం ముహూర్తం రోజు.
ఆరోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రీకరించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య. రాముని పాత్ర ధారి ఎన్ టి రామారావు కు అలంకరణ చేశారు. లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అన్నారు దర్శకుడు. ఎన్టీఆర్ రాజసం ఉట్టిపడేలా నడచి వస్తున్నారు. కట్ అన్నారు దర్శకుడు. ఫ్లోర్ అంతా చప్పట్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఆనందం చెప్పనలవి కాదు. గబ గబ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కౌగలించుకొని…. “సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడిలా ఉన్నావు. తెలుగు చిత్ర పరిశ్రమలో నీకిక ఎదురులేదు. పౌరాణిక నటుడిగా జేజేలు అందుకుంటావు..” అని హస్త సాముద్రికంలో ప్రవేశం వున్న రేలంగి.. ఏదీ చెయ్యి చూపు. అబ్బో! నీకు 50 ఏళ్లు దాటిన తర్వాత భారత దేశం గర్వించే గొప్ప జాతకుడవు అవుతావు. అప్పుడు నన్ను గుర్తు పెట్టుకో. “అన్నారు. దర్శకుడు పుల్లయ్య, నటి అంజలీదేవి ఏక కంఠంతో” “తథాస్తు ” అన్నారు. అదే ఈ అపురూప దృశ్యం.

Related posts