telugu navyamedia
సినిమా వార్తలు

66 సంవత్సరాల “రాజ నందిని”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం జలరుహా ప్రొడక్షన్స్ “రాజ నందిని” సినిమా
04-07-1958 విడుదలయ్యింది.

నిర్మాతలు మిద్దె జగన్నాధరావు, మిద్దె రామకృష్ణారావు గార్లు జలరుహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రఖ్యాత దర్శకులు వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి స్క్రీన్ ప్లే: వేదాంతం రాఘవయ్య, కథ, మాటలు, పాటలు: మల్లాది రామకృష్ణశాస్త్రి, సంగీతం: టి.వి.రాజు, ఫోటోగ్రఫీ: ఎం.ఏ.రహమాన్, నృత్యం: వెంపటి సత్యం, కళ: తోట వెంకటేశ్వరరావు, కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం అందించారు.

ఈ చిత్రంలోఎన్.టి. రామారావు, అంజలీదేవి, రేలంగి, గుమ్మడి, జి.వరలక్ష్మి, ఆర్.నాగేశ్వరరావు, గిరిజ, కృష్ణకుమారి, రాజనాల, మహాంకాళి వెంకయ్య, తదితరులు నటించారు.

సంగీత దర్శకులు టి.వి.రాజు గారి సంగీత సారధ్యంలో
“హర హర పురహర శంభో,
హిమ ధరణీధర రాజనందినీ,”
“కథ నాకు తెలుసోయి అందాల నెల బాలుడా”
“అందాల చిందు సీమలో వుందాములే హాయిగా”
“కొమ్మ మీద కోయిలుందిరా సినవోడా”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

విజయవాడ లక్ష్మీ టాకీస్ అధినేతలు మిద్దె జగన్నాధ రావు, మిద్దె రామకృష్ణారావు లు నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ఎన్టీఆర్ గారితో తొలిసారిగా ఈ జానపద చిత్రాన్ని నిర్మించారు.

ఆ పిదప ఎస్.వి.ఎస్. బ్యానర్ పై ఎన్టీఆర్ గారితో నిండు మనసులు, నిండు హృదయాలు, నిండు దంపతులు, కలిసి వచ్చిన అదృష్టం, డబ్బుకు లోకం దాసోహం సినిమాలు నిర్మించారు.

ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలు కేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు జరుపుకుని, 50 రోజులు పైగా ప్రదర్శింపబడింది…

Related posts