టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు. గేటు వద్ద ఉన్న వాచ్‌మన్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా పక్కకునెట్టి కంప్యూటర్లతో పరారయ్యారు.
ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. చోరికి యత్నించిన వారు గతంలో కోడెల వద్ద పనిచేసిన వారిగా గుర్తించారు. ఒకరు సత్తెనపల్లి మున్సిపల్ ఉద్యోగి అర్జునుడిగా తెలుస్తోంది. చోరికి గురైన రెండు కంప్యూటర్లలో ఒకదానిని తిరిగి కోడెల కార్యాలయం గోడ వెనుక పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.