బ్యానర్ : క్రియేటివ్ కమర్షియల్స్
నటీనటులు : ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్ (స్పెషల్ రోల్)
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
సమర్పణ : కె.ఎస్.రామారావు
సంగీతం : దిబు నినన్
కెమెరా : ఐ.అండ్రూ
కథ : అరుణ్ రాజ్ కామరాజ్
నిర్మాత: కె.ఎ.వల్లభ
రీమేక్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. తమిళంలో విజయవంతమైన “కనా” సినిమాను తాజాగా భీమనేని తెలుగులో “కౌసల్య కృష్ణమూర్తి” పేరుతో రీమేక్ చేశారు. సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళ తంబీలను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ :
కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) అనే రైతు ఇరగవరం అనే పల్లెటూర్లో తన కుటుంబంతో ఉంటారు. ఆయన వ్యవసాయంతో పాటు క్రికెట్ ను కూడా అమితంగా ప్రేమిస్తాడు. క్రికెట్ లో ఎప్పుడూ ఇండియానే గెలవాలని కోరుకుంటాడు. ఇండియా ఓడిపోయిన ప్రతీసారి ఏడ్చేసేంత ఇష్టం కృష్ణమూర్తికి క్రికెట్ అంటే. దీంతో అందరూ అతన్ని క్రికెట్ పిచ్చోడు అంటారు. ఇదంతా చూసిన ఆయన కూతురు కౌసల్య (ఐశ్వర్యా రాజేష్) తాను క్రికెటర్ గా మారి ఇండియాను గెలిపించాలని అనుకుంటుంది. పల్లెటూరు కావడంతో అక్కడ అమ్మాయిలు క్రికెట్ ఆడరు. అందుకే అబ్బాయిలతో క్రికెట్ ఆడుతూ… నేర్చుకుంటుంది. కానీ అమ్మాయి పెద్దదయ్యే కొద్దీ అబ్బాయిలతో ఆడడం ఏంటి అని భార్యతో సహా ఎంతమంది అంటున్న కృష్ణమూర్తి ఇదేమీ పట్టించుకోకుండా కూతురికి ప్రోత్సాహం అందిస్తాడు. మరో పక్క నీళ్లు లేకపోవడంతో కృష్ణమూర్తి పంటలు ఎండిపోతాయి. దీంతో లోన్ కట్టమని బ్యాంకు అధికారులు కృష్ణమూర్తిపై ఒత్తిడి తెస్తుంటారు. చివరకు వాళ్ళ ఇంటిని జప్తు చేస్తారు. ఆ సమయంలో కృష్ణమూర్తి ఏం చేశాడు ? కౌసల్య క్రికెట్ భవిష్యత్ ఏమవుతుంది ? అసలు నెల్సన్ ఎవరు ? చివరకు కౌసల్య ఏం చేస్తుంది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
నటీనటుల విషయానికి వస్తే… కథ మొత్తం రెండు పాత్రల మధ్యే నడుస్తుంది. తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ తమిళంలో బిజీ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఇదే తొలిచిత్రం. అయితే తమిళంలో చేసిన పాత్రే కాబట్టి… తెలుగులోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కృష్ణమూర్తి అనే రైతు పాత్రలో రాజేంద్రప్రసాద్ అద్భుతంగా నటించారు. ఇక ఝాన్సీ, గెస్ట్ రోల్ చేసిన శివకార్తీకేయన్, కార్తీక్ రాజు, భీమనేని, రవిప్రకాశ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
రైతుల సమస్యలు, అన్నీ తెలిసినా బ్యాంకులు రైతులను పెట్టే ఇబ్బందులు, రైతుల సమస్యలపై ప్రభుత్వం తీరు వంటి అంశాలన్నీ సినిమాలో ఉంటాయి. ఇవి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో రాజేందప్రసాద్, ఐశ్వర్యా రాజేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాలో దిబు మీనన్ అందించిన సంగీతం బాగుంది. అండ్రూ కెమెరా పనితనం బావున్నాయి. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
రేటింగ్ : 3/5
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా… కేసు నమోదు