వికారాబాద్ జిల్లా వికారాబాద్-కోటపల్లి మధ్య టీజిఎస్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
కోటపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు సమీపంలో బోల్తా పడింది.
మరో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
వీరిలో ఒకరి తలకు బలమైన గాయమై పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.