ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్రపతి కోరారు.
మోదీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
స్వతంత్ర భారతంలో వరుసగా మూడోసారి ప్రధాని కావడం నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమార్హం.