telugu navyamedia
తెలంగాణ వార్తలు

రైతులకు మద్దతుగా 12న తెలంగాణ మంత్రుల ధర్నా

హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల 12న చేపట్టే ధర్నాకు ఏర్పాట్లను హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత పరిశీలించారు.

అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. ఈ నెల 12వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున. ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వరి సాగు పెరిగిందని తెలిపారు.

వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Related posts