telugu navyamedia
తెలంగాణ వార్తలు

క్లౌడ్ బ‌రెస్ట్‌ అనే కొత్త ప‌ద్ద‌తి వ‌చ్చింది ..asభారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ అనుమానాలు

*భ‌ద్రాచ‌లంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
*ముంపు బాధితుల‌తో నేరుగా చ‌ర్చించిన కేసీఆర్‌

*ముంపు బాధితుల‌కు రూ.10 వేలు ..20 కేజీలు బియ్యం
*బాధితుల‌కు శాశ్వ‌త కాల‌నీలు నిర్మిస్తాం..
*ఎత్తైన ప్ర‌దేశాల‌ను గుర్తించాల‌ని క‌లెక్ట‌ర్‌కు సీఎం ఆదేశం
*ఈనెల‌29 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు ఉన్నారు
*క‌డెం చ‌రిత్ర ఊహించ‌ని వ‌ర‌ద
*ఈ వ‌ర‌ద‌ల‌కు ఇత‌ర దేశాల కుట్ర ఉంది..
*క్లౌడ్ బ‌రెస్ట్‌ అనే కొత్త ప‌ద్ద‌తి వ‌చ్చింది..
*లద్దాఖ్‌, లేహ్‌, ఉత్తరాఖండ్‌లో ఇలానే కుట్ర‌లు జ‌రిగాయి.
*ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి
*క‌ర‌క‌ట్ట‌పై ఏపీ ప్ర‌భుత్వంతో మాట్లాడ‌తా..
*ఏపీ ప్ర‌భుత్వం పాకిస్తాన్ కాదు..

భారత్‌లో ఆకస్మిక వర్షాలు, వరదల వెనక ఇత‌ర దేశాల‌ కుట్రలు ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో లద్దాఖ్, ఉత్తరాఖండ్‌లో ఇలానే చేశారని.. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ అదే జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆదివారం ఉదయం భద్రాచ‌లంలో పర్యటించిన ఆయన అక్కడ వరద పరిస్థితిని సమీక్షించారు.ముంపు బాధితుల‌తో నేరుగా మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారిస్తామ‌ని తెలిపారు. వరదల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పిస్తామని.. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. ముంపు బాధితుల‌కు రూ.10 వేలు ..20 కేజీలు బియ్యం ఇస్తామ‌ని అన్నారు.

”కడెం ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ఫొటోలు, వీడియోలు చూస్తుంటే మొత్తం అంతా నీళ్లు ఉండి..డ్యామ్ చిన్న గీతలా కనిపిస్తోంది. అదృష్టం వల్ల కడెం ప్రాజెక్టు దక్కింది. క్లౌడ్ బరస్ట్ అనేది ఓ కొత్త పద్దతి వచ్చింది. దీని మీద కుట్రలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్టో తెలియద. ఇతర దేశాల వారు మన దేశంలో కావాలనే అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేశారు.

గతంలో లద్దాఖ్‌, లేహ్‌, ఉత్తరాఖండ్‌లో చేశారు. ఇప్పుడు గోదావరి పరిహవాక ప్రాంతాల్లో కూడా చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఏమేనప్పటికీ వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇలాంటి ఉత్పాలు సంభిస్తాయి కాబట్టి.. అలాంటి సమయంలో ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

Related posts