telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా కాటుకు ఆరుగురు బలి!

karona chekup hospital

తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరుకొంది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ ఆరుగురు న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారేనని స్పష్టం చేసింది. దీంతో మొత్తం ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు 76కు చేరాయి.

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది.

సీఎంఓ తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, అపోలో, గ్లోబల్‌ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీరి ద్వారా కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ఆసుపత్రుల్లో రిపోర్ట్ చేయాలని తెలంగాణ వైద్య విభాగం విజ్ఞప్తి చేస్తోంది” అని ట్వీట్ చేసింది.

Related posts