telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంది..

యాదాద్రి కూడా హైదరాబాద్‌తో కలిసి పోయిందని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్‌ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన‌ అనంతరం మాట్లాడుతూ.. దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించామ‌ని అన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయ‌ని వెల్ల‌డించారు.

స‌మైక్య రాష్ర్టంలో చెరువుల్ని నాశనం చేశారు.. ఈ వేళ మిషన్‌ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, . భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు. తెలంగాణ‌లో మూడు ఎకరాల ఉన్న రైతు ఇప్పుడు కోటీశ్వ‌రుడని సీఎం అన్నారు .

మారుమూల గ్రామాలకు పోతే 25-30లక్షల్లోపు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదన్నారు.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాగనూర్‌ మండల కేంద్రంలో భూములు అడిగేవారి ఉండకపోయేది.. కానీ, ఇప్పుడు అక్కడ సైతం రూ.25లక్షల ఎకరంకు తక్కువ లేదన్నారు..

గతంలో మీకు పరిపాలన చేతకాదని ఎద్దేవా చేశారు. కరెంట్‌ ఉండదు. అంతా చీకటే అన్నారు. ఒక సీఎం అయితే కట్టెతో మ్యాప్‌లో చూపించారు. అప్పుడు అలా చూపించిన వాళ్ల రాష్ట్రంలో కరెంట్‌ లేదు. మన దగ్గర 24 గంటల కరెంట్‌ ఉంది. హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్‌ అద్భుతంగా డెవలప్‌ అవుతోంది.

ఎప్పుడు ఎవరూ ఊహించిన మాట కాదు.. భువనగిరి జిల్లా అవుతుందని కలలో ఎవరూ అనుకోలేద‌ని అన్నారు.తెలంగాణ ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంద‌ని అన్నారు. దేశం తిరోగ‌మ‌నంలో ఉంటే..రాష్ర్టం పురోగ‌మ‌నంలో ఉందని అన్నారు.

Related posts