telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ యుద్ధం నా కోసం కాదు ..మునుగోడు ప్ర‌జ‌లు కోసం..కేసీఆర్‌ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలి

*గ‌న్ పార్క్ రాజ‌గోపాల్ రెడ్డి వద్ద నివాళులు
*కోమ‌టిరెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డి కీల‌క కామెంట్స్‌
*స్పీక‌ర్ కు రాజ‌నామా లేఖ‌ను ఇవ్వ‌నున్న రాజ‌గోపాల్‌
*స్పీక‌ర్ రాజీనామాను ఆమోదిస్తార‌ని భావిస్తున్నా..
*యుద్ధం నా కోసం కాదు ..మునుగోడు ప్ర‌జ‌లు కోసం
*ఉప ఎన్నిక వ‌చ్చాక సీఎం కేసీఆర్ కు మునుగోడు గుర్తొంచింది..

అవినీతి పాల‌న‌కు వ్య‌తిరేకంగా, ఒక కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేకంగా రాజీనామా చేస్తున్నాన‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు.

ఈ ఉద‌యం గ‌న్‌పార్క్ వ‌ద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాను మీడియా సమక్షంలో చూపించారు. 

తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని అన్నారు.కేసీఆర్‌ చేతిలో ఆత్మగౌరవం బంధీ అయ్యిందని కోమటిరెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు

ఈ యుద్ధం త‌న కోసం కాదు మునుగోడు ప్ర‌జలు కోసం అని వెల్ల‌డించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని, రాజీనామా అనంతరమే సీఎం కేసీఆర్ కు మునుగోడు గుర్తొంచింద‌ని అన్నారు . ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి అనే మాట చెబుతున్నారు.తన  రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు.

కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నో ఆశలతో తెలంగాణ వచ్చిందని, తన రాజీనామాతోనైనా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరవాలని హితవు పలికారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి.. కేసీఆర్‌ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలని కోరారు.

సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాసేపట్లో స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేయనున్నారు.

Related posts