telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జాస్తివారి వీధిలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే.. ఎక్కువగా ప్రశ్నించారని చంద్రబాబుకు అశోక్‌బాబు తెలిపారు.

ఆనంత‌రం చంద్ర‌బాబుతో మీడియ‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును‌ నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు. రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి, పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి, లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం మ‌ని హెచ్చరించారు. ప్రభుత్వ వేధింపులతో కోడెలను‌ పొట్టన పెట్టుకున్నారు. అనేకమంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్నారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని, జైళ్లలో కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో వరుణ్ రెడ్డి జైలరుగా ఉన్నప్పుడు ఆ జైలులో మొద్దు శ్రీను హత్య జరిగిందని చంద్రబాబు చెప్పారు.

గతంలో పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు జైలర్ గా వరుణ్ రెడ్డి ఉన్నారని చంద్ర‌బాబు అన్నారు. వరుణ్ రెడ్డిపై అనేక శాఖపరమైన కేసులున్నాయని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలను ఆయనను పక్కన పెట్టాయని చంద్రబాబు తెలిపారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరుణ్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చి కడప జైలరుగా నియమించారని తెలిపారు. కడపలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఉన్నారని,  అక్కడున్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను చంపేస్తారా..?. అతడు ఉండాల్సింది జైలర్‌గా కాదని.. జైలులో’ అని చంద్రబాబు అన్నారు.

కడప జైలర్‌గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని చెప్పారు. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ప్రాణ హాని ఉందన్నారు. 

Related posts