ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు మీడియా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ లు వెంకయ్యనాయుడుని కలిసి ఈ లేఖను అందజేశారు.
టీడీపీని విభేదించి బయటకు వచ్చామని, తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని లేఖపై నలుగురు ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన విందు భేటీకి హాజరైన సమయంలో టీడీపీ ఎంపీలు ఆయనకు ఈ లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది.