ఏపీ టీడీపీ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు కోడెల శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. కోడెల శివప్రసాదరావు ఆయన తనయుడు శివరామకృష్ణ పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం, వీరిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల కుటుంబసభ్యులపై సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.కే ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.