ఏపీ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన్న వెంకట అప్పలనాయుడు గురువారం ఉదయం సభాపతి తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు తదితరులు తమ్మినేనిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు.
మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్సీపీ తరపున తమ్మినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో తమ్మినేని మూడుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు