ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు ఫిబ్రవరి 20, 2014న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లయిందని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన నమ్మక ద్రోహాన్ని ఎండగడుతూ, ఐదో వార్షిక నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా జరపాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసి, ప్రత్యేక హోదా సహా ఎన్నో హామీలను గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు. కొత్త పరిశ్రమలకు రాయితీలను ప్రకటించలేదని పార్టీ నేతలతో ఆయన చర్చించారు.
రాష్ట్రానికి ఉన్న ఆర్థికలోటును భరిస్తామని చెప్పిన కేంద్రం నాలుగో వంతును కూడా చెల్లించలేదన్నారు. ఇచ్చిన రూ.350 కోట్లను కూడా వెనక్కు తీసుకున్నారని మండిపడ్డారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బీజేపీ నమ్మకద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య అనివార్యత వల్లే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయని, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ పులివెందుల పులిబిడ్డ: సినీనటి రమ్యశ్రీ