telugu navyamedia
సినిమా వార్తలు

విశాల్ కు తీవ్రగాయాలు

ప్రముఖ తమిళ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తాజా చిత్రం షూటింగ్ సమయంలో గాయపడ్డట్టుగా సమాచారం. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చేయి విరిగాయని తెలుస్తోంది.
కాలికి, చేతికి బ్యాండేజ్ తో విశాల్ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫైట్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా షూటింగ్ చేయడం వల్లనే విషయాలు గాయపడ్డారట. దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. విశాల్ గతంలో “తుప్పరివాలన్” సినిమా చిత్రీకరణలో కూడా గాయపడ్డారు. ఇక మే 10న ప్రేక్షకుల ముందుకు రానున్న “అయోగ్య” చిత్రంలో కూడా ఓ పాట చిత్రీకరణలో ఆయన గాయపడినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో ఎన్టీఆర్ నటించిన “టెంపర్”కు రీమేక్. 

Related posts