telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మాస్టర్” చిత్రాన్ని ముందుగా విడుదల చేస్తే కరోనా వ్యాప్తి… తమిళనాడు సీఎంకు లేఖ

Master

లాక్‌డౌన్ వలన సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దాదాపు రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా పనులన్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతుండగా, మరి కొద్ది రోజులలో షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ ఓపెనింగ్‌పై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు, నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్… తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాసారు. విజయ్ నటించిన “మాస్టర్” చిత్రాన్ని ముందుగా విడుదల చేయోద్దంటూ ఆ లేఖలో పేర్కొంటూ, “మాస్టర్” చిత్రం ముందుగా విడుదలైతే ప్రేక్షకులు థియేటర్స్‌కి భారీగా వస్తారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశముంది. దీని వలన విజయ్‌కి కూడా చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉందని కేయార్ లేఖలో పేర్కొన్నారు. సినీ నిర్మాతలకి విధించే 26 శాతం పన్నుని రానున్న మూడు నెలలు మాఫీ చేయాలని అన్నారు కేయార్. “మాస్టర్” చిత్రం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల “వాతి కమ్మింగ్”‌ అనే పాట విడుదల చేయగా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

Related posts