telugu navyamedia
రాజకీయ

ఎన్నికల వేళ పెరిగిన బీరు ధరలు .. యువకుల అసహనం .. 

Beers supply stopped from liqur depo
ఎన్నికల సందర్బంగా మద్యం, నగదు ఏరులైపారుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సందర్భంలో బీరును ఎక్కువ ధరకు అమ్ముకోవడం కూడా సహజం. దీనికి ఆగ్రహించిన ఇద్దరు యువకులు షాపులో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని కాల్చిచంపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలోని ఐచార్ ప్రాంతంలో ఉన్న ఓ బీరు షాపు వద్దకు సురేంద్ర, రాజు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీర్ ధర ఎంత? అని వీరు అడగ్గా షాపులో పనిచేస్తున్న కుల్దీప్ సమాధానం ఇచ్చాడు. 
అయితే మిగతా షాపుల కంటే ఇక్కడ రూ.10 అధికంగా అమ్ముతున్నారని యువకులు కుల్దీప్ తో వాగ్వాదానికి దిగారు. వివాదం కాస్తా ముదరడంతో ఇద్దరు యువకులు తమ తుపాకులతో కుల్దీప్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లిపోవడంతో కుల్దీప్ రక్తపు మడుపులో పడిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కుల్దీప్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరారీలో ఉన్న సురేంద్ర, రాజు కోసం గాలింపును ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Related posts