telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా అనుమతి లేకుండా వాడారు… 70కోట్లు నష్టపరిహారం ఇవ్వండి

selina-gomej

పాపులర్ సింగర్ సెలెనా గోమెజ్ తన అనుమతి లేకుండా తన పేరుతో పాటు, మొహాన్ని కూడా వాడుకున్నారంటూ ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10మిలియన్ డాలర్లు(రూ.70కోట్లపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది. తన ప్రెస్టీజ్ తగ్గించే విధంగా సదరు గేమ్ కంపెనీ ప్రవర్తించిందని.. పలు పాపులర్ బ్రాండ్స్ వారు తమ ప్రచారం కోసం సెలెనాకు కోట్లాది రూపాయలు చెల్లిస్తాయని, అలాంటిది కనీసం అనుమతి కూడా లేకుండా ఆమె రూపాన్ని, పేరును వాడుకోవడం నేరమని సెలెనా గోమెజ్ పిటిషన్లో పేర్కొంది. సెలబ్రిటీల పిక్స్ వాడే ముందు వారి పర్మిషన్ తప్పనిసరి అని లేని పక్షంలో వారు దావా వేసినంతా కట్టకతప్పదని పలువురు హాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related posts