బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ “కేదారనాథ్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ కథానాయకుడు. ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ లో కూడా వీరు బాగా నటించడంతో తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
నిన్న సుశాంత్ రాజ్ పుత్ పుట్టినరోజు సందర్భంగా సారా అలీఖాన్ డెహ్రాడూన్ నుంచి రావడమే కాకుండా ప్రత్యేకంగా కేక్ కు కూడా తీసుకొచ్చింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కు వెళ్లడంతో ఆ వార్తలకు కాస్తా బలం చేకూరింది. సారాకు ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కొత్త… అయితే సుశాంత్ రాజ్ పుత్ మాత్రం ఇంతకుముందు హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించారు. గతంలో ఓ టీవీ నటితో, ఆ తరువాత హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ చేశారు. ఆ వార్తలపై సుశాంత్ ఇప్పటి వరకూ స్పందించలేదు. మరి ఇప్పుడైనా సారా అలీఖాన్ తో ప్రేమాయణంపై వస్తున్న వార్తలపై స్పందిస్తారేమో చూడాలి.