telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్‌ తల్లి పాత్రలో సీనియర్‌ నటి !

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో చేస్తుండగా అతని తల్లి పాత్రలో అంటే కౌశల్య పాత్రలో అలనాటి అందాల నటి హేమమాలిని చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈసినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రంలో రావణుడిని కొత్తగా చూపించనున్నారంట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి. ఈ సినిమా కోసం బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts