telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్ము కశ్మీర్‌ పరిస్థితులపై స్పందించిన సుప్రీం కోర్టు!

Supreme Court

జమ్ము కశ్మీర్‌ పరిస్థితుల పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్న పిటిషనర్ల వాదనపై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. జమ్ము కశ్మీర్‌పై. కశ్మీర్‌కు స్వయంగా తాను వెళ్లేందుకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ సిద్ధమయ్యారు.

మరోవైపు కశ్మీర్‌ వెళ్లేందుకు పిటిషనర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు కోర్టు అనుమతించింది. నాలుగు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని తమకు నివేదించాలని సుప్రీం కోర్టు కోరింది. కశ్మీర్‌లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న వార్త ఛానెల్స్, పత్రికలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Related posts