telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె 14వ రోజుకి చేరిన సర్కారులో చలనం లేదు: వీహెచ్

hanmanth rao congress

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరిన సర్కారులో చలనం లేదన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు జీతాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలు ఉన్నప్పుడు కార్మికులకు సంఘాలు ఉండకూడదా? అని నిలదీశారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు.

Related posts