telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దర్భార్” సెట్లో రజినీకాంత్… వైరల్ గా మారిన కొత్త లుక్

rajinikanth

ప్రముఖ దర్శకుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం “ద‌ర్భార్”. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్, మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్, యువ‌రాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్, విజ‌య్ సేతుప‌తి ధ‌ర్మ‌దొరైలో న‌టించిన జీవా అనే ట్రాన్స్‌జెండ‌ర్ ద‌ర్భార్ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. తాజాగా సెట్‌లో ర‌జ‌నీకాంత్‌, మురుగ‌దాస్ క‌లిసి దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇందులో ర‌జ‌నీకాంత్ లుక్స్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ర‌జ‌నీ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తుండ‌గా, ఇందులో ఒకటి పోలీసు అధికారి పాత్రకాగా, మ‌రొక‌టి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. దాదాపు పాతికేళ్ల తర్వాత రజనీ వెండితెరపై పోలీసు అధికారి గెటప్‌లో దర్శనమివ్వబోతుండే స‌రికి అభిమానుల‌లో అంచ‌నాలు భారీగా పెరిగాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్ ను త్వ‌రలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts