ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు సూపర్‌స్టార్ మహేశ్. ప్రస్తుతం ఆయన కుటుంబంతో సరాదాగా గడుపుతున్నారు. తదుపరి తన 27వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ‘మహర్షి’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ మరోసారి నటించబోతున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా.. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ పలు ఆసక్తికరమైన అంశాలకు సంబంధించి సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా తన పొలిటికల్ ఎంట్రీపై వస్తోన్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. మీరు ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలన్నారు. తన దృష్టంతా సినిమాలపైనేనని, రాజకీయాల గురించి తనకేమీ తెలియదని ఆయన తెలిపారు. మహేశ్ హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో సీఎం నటించి ప్రేక్షకులను మెప్పించారు.
previous post