telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రోడ్డుపై చెత్త వేసిన ప్రముఖ బ్యాంకు .. జరినామా విధించిన అధికారులు…

ghmc 20000 penalty to kotak bank

కోటక్‌ మహీంద్రా బ్యాంకు చెత్తను, వ్యర్థాలను రోడ్డుపై వేయటంతో, వారికి జీహెచ్‌ఎంసీ రూ.20వేల జరిమానా విధించింది. సోమాజిగూడలోని కోటక్‌ మహీంద్రా బ్యాంకు సమీపంలో వారు కొన్ని సంచుల్లో వ్యర్థాలను ఉంచడంతో పాటు చెత్తను బ్యాంకు ముందు ఉన్న ఫుట్‌పాత్‌, రోడ్డుపై వేశారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ఖైరతాబాద్‌ సర్కిల్‌ వైద్యాధికారి భార్గవ్‌ నారాయణ, సిబ్బందితో అక్కడికి వెళ్లి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వారికి రూ.20వేల జరిమానాను విధించారు. చెత్తను చెత్త కుండీలలోనే జార విడవాలని, ఇష్టానుసారంగా రోడ్లపై వేస్తే జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు.

Related posts