telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పుష్ప” స్టోరీ కాపీ… ఆధారాలతో సహా రచయిత చేసిన పోస్ట్ వైరల్

Pushpa

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తు్న్నారు. ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా ఇంకా ‘పుష్ప’ షూటింగ్ తిరిగి ప్రారంభంకాలేదు. అయితే ఇప్పుడు ఓ రచయిత ‘పుష్ఫ’ సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను రాసిన ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ అనే పుస్తకాన్ని కాపీ కొట్టి.. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వేంపల్లి గంగాధర్ అనే రచయిత. ఈ పోస్ట్‌లో “సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి.. ముందుగానే రాసి పెట్టిన కథను, పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి. తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి. సాక్షి ఆదివారం అనుబంధం( 04 నవంబర్ 2018)లో నేను రాసిన ‘తమిళ కూలీ’ కథ మొత్తం వాడేసుకోండి. గత సంవత్సరం (2019) మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ ను ఉడికించి వంట చేస్కోండి. కనీసం పేరు కూడా రిఫరెన్స్‌గా సినిమాలో వేయకండి. ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి… మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం” అంటూ ఆధారాలతో సహా ఫేస్ బుక్‌ వాల్‌పై తన ఆవేదన వ్యక్తం చేశాడు ఈ తెలుగు రచయిత.

సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి…ముందుగానే రాసి పెట్టిన కథను ,పుస్తకాన్ని, వ్యాసాలను…

Posted by Vempalli Gangadhar on Tuesday, 25 August 2020

కాగా ఓ రెండేళ్ల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘మొండి కత్తి’ కథను కాపీ కొట్టి తేనిపూసిన కత్తిగా మార్చాడంటూ వేంపల్లి గంగాధర్ అనే రచయిత ఫేస్ బుక్‌పై సంచలన పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో.. తనను త్రివిక్రమ్ ఎలా మోసం చేశారో వివరిస్తూ.. ఆయన రాసిన ‘మొండి కత్తి’ కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Related posts