telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

తమ కూతురుకి నామకరణం చేసిన కోహ్లీ, అనుష్క దంపతులు

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి11న సాయంత్రం అనుష్క శర్మా పాపకు జన్మనిచ్చిందన్న విషయాన్ని విరాట్ ప్రకటించాడు. దీనిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని విరాట్ ఆ రోజే అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తమ ప్రైవసీకి భంగం కలిగించద్దంటూ కూడా ఆ రోజు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ప్రపంచంలో పాపులర్ కపుల్‌గా గుర్తింపు పొందిన వీరుష్క తమ కూతురుకి ‘వామిక’గా నామకరణం చేశారు. బారసాల వేడుకలోని ఫోటోతో వీరుష్క తమ కూతురి మొదటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా ‘మేమిద్దరం ప్రేమ, గౌరవంతో కలిసి జీవించాం. మా కూతురు వామిక మాప్రేమను మరో స్థాయికి చేర్చింది. బాధ, ఆనందం, కన్నీళ్లు, అన్నింటినీ కొన్నిసార్లు కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభూతి చెందుతా’మని వీరుష్క రాసుకొచ్చారు. ఈ ఫోటోలో అనుష్క కూతురుని ఎత్తుకొని ఉన్నారు. విరాట్ కూడా తన ఎంతో సంతోషంగా తన కూతురుని చూసుకుంటున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వీరు షేర్ చేసిన వెంటనే అభిమానులు విష్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరుష్క షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts