telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’ కోసం విల‌న్‌గా మారీన సునీల్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్యాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో ఎర్రచందనం స్మగ్లర్ గా అల‌రించ‌నున్నాడు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక న‌టించ‌గా.. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు.

Pushpa Poster: Allu Arjun's film Pushpa to release on August 13, actor  shares intriguing first-look poster

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, పోస్టర్లు మరియు టీజర్లకు భారీ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

తాజాగా ఈ సినిమాలో సునీల్‌ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ ను చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది.    సునీల్‌ మునుపెన్నడూ లేని విధంగా ‘పుష్ప’ కోసం విల‌న్‌గా మారాడు. సునీల్‌ ఈ చిత్రంలో మంగళం శ్రీను పాత్రలో నటిస్తుండగా…దానికి సంబంధించిన పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. “రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌” అని వ్యాఖ్య రాసుకొచ్చింది.

Allu Arjun's Pushpa second song Srivalli to release on October 13 - Movies  News

ఇక ఈ పోస్టర్‌ లో సునీల్‌… చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. నుదుటన బొట్టు, మెడలో చైన్​లు,​ చేతిలో పాత మొబైల్​ ఫోన్ లో​ ఎరుపెక్కిన కళ్లతో సీరియస్​ మాట్లాడుతున్న సునీల్‌ లుక్‌ అదిరిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు హాస్యనటుడిగా, హీరోగా అలరించిన  సునీల్‌ ఇప్పుడు విల‌న్ పాత్ర‌లో భ‌య‌పెడుతున్నాడు..

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts