telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆర్యన్‌ ఖాన్‌కు సమన్లు జారీ చేసిన ఎన్సీబీ..

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో దర్యాప్తుపై ఎన్సీబీ దూకుడు పెంచింది. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌తో పాటు మరో ఆరుగురికి ఎన్సీబీ సిట్‌ సమన్లు జారీ చేసింది.

ఢిల్లీ ఎన్‌సీబీ సిట్ బృందం అర్బాజ్ మర్చంట్, అచిత్ కుమార్‌లను విచారణకు పిలిచింది. ఇవారిద్దరూ ఈరోజు ఎన్సీబీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎన్‌సీబీ సిట్‌ విచారిస్తున్న 6 కేసుల్లో నిందితులందరినీ విచారణకు పిలుస్తారు. ఆర్యన్ ఖాన్, నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌లకు కూడా సమన్లు ​​జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలని ఆర్యన్ ఖాన్‌ను కోరారు.

అయితే ఆర్య‌న్‌కు జ్వరంతో బాధపడుతున్నాడని, అందువల్ల అతను ఈరోజు  విచార‌ణ‌కు హాజరుకాలేనని NCBకి చెప్పాడు. రేపు మరుసటి రోజు వస్తాడు అని తెలిపారు.

Officer' Keen on Aryan's Arrest, Probe 'Misguided': Sources Say Delhi NCB  Found 'Lapses' in Drugs Case

నిందితులు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ డిప్యూటీ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో సమన్లు పంపింది. విచారణలో భాగంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బంధువు సమీర్ ను కూడా ఎన్సీబీ ప్రశ్నించనుంది.

ఇదిలావుండగా,..ఢిల్లీలోని ఎన్‌సీబీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆపరేషన్స్‌ బ్రాంచ్‌కు చెందిన ఆరుగురు సభ్యుల సిట్‌ బృందం శనివారం రాత్రి ముంబైలోని కార్డెలియా క్రూజ్‌ను పరిశీలించింది. డ్రగ్‌ కేసును తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఢిల్లీ అధికారుల బృందం శనివారం ముంబైకి చేరుకున్నది.

సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఎన్‌సిబి ప్రధాన కార్యాలయంలో డిడిజి ఆపరేషన్స్ సీనియర్ ఐపిఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “మేము కొన్ని కేసులను స్వాధీనం చేసుకున్నాము మరియు దానిపై మా దర్యాప్తును ప్రారంభిస్తాము అని అన్నారు. ఈ కేసుల దర్యాప్తులో ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సహాయం కూడా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మ‌రోవైపు ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌. ఆర్యన్‌ను కిడ్నాప్‌ చేసి ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు మాలిక్‌ . సెప్టెంబర్‌ లోనే దీనికి కుట్ర జరిగిందని, సమీర్‌ వాంఖడే సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 27న ఆర్యన్‌ కిడ్నాప్‌కు ప్లాన్‌ జరిగిందని ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది.

Related posts